భర్త మరణంతో కుంగిపోయి మహిళ ఆత్మహత్య

సికింద్రాబాద్‌లోని మాణికేశ్వరీనగర్‌లో వరికుప్పల భారతి (48) అనే మహిళ బుధవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల భర్త లింగస్వామి మరణించడంతో, కూరగాయలు కట్ చేసే కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న భారతి ఈ దారుణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్