యువ వైద్యురాలిని హత్య చేసిన ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన యువకుడు

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో సంగారెడ్డి పట్టణంకు చెందిన యువ వైద్యురాలు డాక్టర్ కె. సృజన (27) హత్యకు గురైంది. హనుమకొండలో వైద్యురాలిగా పనిచేస్తూ పీజీ చదువుతున్న ఆమె ఏడేళ్ల క్రితం ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన రవికుమార్ అనే యువకుడితో స్నేహం చేసింది. ఆమె వద్ద అతను తీసుకున్న గొలుసు ఇస్తానని చెప్పడంతో గత నెల 30న హైదరాబాద్‌కి వెళ్లి తిరిగి రాకపోవడంతో యువతి స్నేహితురాళ్లు తండ్రికి చెప్పగా, ఆయన హన్మకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొబైల్ సిగ్నల్ ఆధారంగా మియాపూర్‌లోని హఫీజ్‌పేటలో రవి కుమార్ తీసుకున్న అద్దెకు వసతిగృహంలో మృతదేహాన్ని కనుగొన్నారు. పథకం ప్రకారం ఆమెను గదికి తీసుకెళ్లి, దిండుతో ఊపిరాడకుండా హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕