పర్నిచర్ షాపులో భారీ అగ్నిప్రమాదం

మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్నిచర్ షాప్‌లో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షాక్ సర్క్యూట్ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో సుమారు 70 లక్షల రూపాయల విలువైన పర్నిచర్ దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో షాప్‌కు అనుకోని ఉన్న అపార్ట్‌మెంట్‌లోని ఏసీ అవుట్‌డోర్ యూనిట్లు కూడా కాలిపోయాయి. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్