నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్.. వ్యక్తి అరెస్ట్

గచ్చిబౌలి పోలీసులు పాత నేరస్థుడు కిలారి నాగతేజ అలియాస్ నాని(24)ని అరెస్ట్ చేశారు. ఇతను సోషల్ మీడియాలో మహిళలను ట్రాప్ చేసి, వారి వీడియోలు రికార్డు చేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. ఇటీవల గచ్చిబౌలిలోని ఒక హోటల్‌లో ఓ యువతిని కత్తితో బెదిరించి, బలవంతంగా నగ్న వీడియోలు తీసి, వాటిని సోషల్ మీడియాలో పెడతానంటూ రూ.1.1లక్షలు వసూలు చేశాడు. శనివారం బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కత్తి, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్