మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నీటి సంపులో బాలుడు పడి మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. హఫీజ్ పేట్ మార్తాండ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న శ్రీను, నిలా దంపతుల కుమారుడు అభి (4) ఆడుకుంటూ వెళ్లి నీటి సంపులో పడి మృతి చెందినట్లు తెలిపారు. యాజమని నిర్లక్ష్యం వల్ల తమ కుమారుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.