మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం స్కూల్ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొని ల్యాబ్ టెక్నీషియన్ నాగరాజు మృతి చెందిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన నాగరాజును ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.