వ్యభిచార ముఠా గుట్టు రట్టు

మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని వైట్ క్యాసిల్ సర్వీస్ అపార్ట్మెంట్స్లో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఫ్లాట్ నంబర్ 501లో జరుగుతున్న ఈ అసాంఘిక కార్యకలాపాలపై విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ప్రధాన నిందితుడు బుర్లే ధనంజయతో పాటు నలుగురు విటులను అదుపులోకి తీసుకున్నారు. అపార్ట్మెంట్లో ఉన్న నలుగురు మహిళలను రెస్క్యూ హోమ్కు తరలించారు. మహిళలను అక్కడికి రప్పించి కస్టమర్లతో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  నాలుగు మొబైల్ ఫోన్లు, రూ.1,48,970 నగదును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕