రంగారెడ్డి: చెరువులో మునిగి టెన్త్ విద్యార్ది మృతి

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. తొర్రూరు గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి అభిలాష్ (16) స్నేహితులతో కలిసి మంగళగుంట చెరువులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో, అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని బయటకు తీసి వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్