రంగారెడ్డి: ఓయూలో మహిళ హత్య.. 24 గంటల్లోనే నిందితుడి అరెస్ట్

చందానగర్ పోలీసులు 24 గంటల్లోనే ఓయూ రూమ్లో జరిగిన మహిళ హత్య కేసును ఛేదించారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మండాల కుమార్, ఇంద్రేశంలో నివాసం ఉంటున్న జి. నరసమ్మ(39)తో పరిచయం పెంచుకున్నాడు. నరసమ్మను ఓయో రూమ్కి రమ్మని చెప్పి చందానగర్కి రప్పించుకున్న కుమార్, గదిలో ఆమెను చున్నీతో గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ఆమె బంగారు చెవి దిద్దులు, మాటీలు (2.360 గ్రాములు), వెండి కాలి పట్టీలు (444 గ్రాములు), వెండి కాలి మెట్టెలు (33.850 గ్రాములు), రెండు మొబైల్ ఫోన్లు దొంగిలించి పారిపోయాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.

సంబంధిత పోస్ట్