రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని గచ్చిబౌలి, బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద పక్వాన్ గ్రాండ్ రెస్టారెంట్ ఎదురుగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఎన్టిటి డేటా వెల్స్ ఫార్గో ఉద్యోగిని తలారి కళ్యాణి (30) తన భర్త చింతల నరేష్ తో కలిసి టీవీఎస్ జూపిటర్ వాహనంపై వెళ్తుండగా, యూ-టర్న్ తీసుకుంటున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కళ్యాణి కింద పడిపోగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. చింతల నరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపారు.