వికారాబాద్ జిల్లా కొంశెట్పల్లి గ్రామంలో హనుమాన్ టెంపుల్ వెనుక ఉన్న పాడుబడ్డ బావిలో 8 ఏళ్ల సాహెల్ అనే బాలుడు ప్రమాదవశాత్తు పడిపోయాడు. ఇద్దరు అన్నదమ్ములు గాలిపటం ఎగురవేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. చుట్టుపక్కల కూలీలు వెంటనే స్పందించి ఒక బాలుడిని కాపాడగా, సాహెల్ బావిలోనే చిక్కుకుపోయాడు. బావిలోని నీటిని బయటకు పంపేందుకు కేన్ సహాయంతో చెట్లను తొలగిస్తున్నారు. ఇప్పటివరకు బాలుడి ఆచూకీ లభించలేదు.