రూ.6,66,666కు లడ్డూను దక్కించుకున్న కౌన్సిలర్ రాజు నాయక్

షాద్‌నగర్‌లోని ఏబి విల్లాస్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన నిమజ్జనం వేడుకల్లో వినాయకుడికి సమర్పించిన పవిత్ర లడ్డూను 6వ వార్డు కౌన్సిలర్ రాజు నాయక్ రూ. 6 లక్షల 66 వేల 666కు వేలంలో కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా రాజు నాయక్ మాట్లాడుతూ పవిత్రమైన వినాయక లడ్డూను కైవసం చేసుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. లడ్డూ వేలం ద్వారా వచ్చిన నిధులను తిరిగి వినాయక ఉత్సవాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వినియోగించడం తనకు ఎంతో సంతోషంగా ఉంటుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕