షాద్ నగర్ లో ప్రేమికుల ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల కేంద్రంలో సోమవారం ఇద్దరు ప్రేమికులు బలవన్మరణానికి పాల్పడ్డారు. బీహార్ నుండి వలస వచ్చిన ట్రక్ డ్రైవర్ నవనీత్ దత్త కుమార్తె అనామిక (21) ధనుంజయ్ (25) అనే యువకుడితో ప్రేమలో ఉంది. గత మూడు రోజులుగా కంపెనీకి వెళ్లని అనామిక ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని కనిపించింది. ఆమెను చూసి తట్టుకోలేక ధనుంజయ్ కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు కొత్తూరు సిఐ నరసయ్య తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్