"స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్"కార్యక్రమంలో భాగంగా షాద్‌నగర్ లోని శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు సోమవారం పట్టణంలో ఘనంగా పర్యావరణ పరిరక్షణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణ, ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండడం, పరిశుభ్రమైన పరిసరాలను కాపాడడం, అధిక సంఖ్యలో మొక్కలు నాటడం వంటి సందేశాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఫరూఖ్‌నగర్ ఎంఈఓ మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.