తలకొండపల్లి: అదుపు తప్పిన ట్రాక్టర్.. డ్రైవర్ అక్కడికక్కడే మృతి

తలకొండపల్లి మండలం జులపల్లి గ్రామ శివారులో బుధవారం సాయంత్రం ఓవర్ స్పీడ్‌గా వెళ్లిన ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ ఆంజనేయులు ట్రాక్టర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యులు తీవ్ర శోకంలో మునిగిపోయారు.

సంబంధిత పోస్ట్