నార్సింగీలోని గండిపేటలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఆడుకుంటూ బయటికి వచ్చిన 8 నెలల పసికందు ప్రమాదవశాత్తు సంపులో పడి మృతి చెందింది. కుటుంబ సభ్యులు వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మహారాష్ట్రకు చెందిన ఈ చిన్నారి తల్లిదండ్రులు జీవనోపాధి కోసం హైదరాబాద్‌లోని గండిపేటలో నివసిస్తున్నారు. ఈ ఘటనతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.