ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నాయకులను బ్లాక్‌మెయిల్ చేసి బీఆర్ఎస్‌లో చేర్చుకున్నారని ఆరోపించారు. పదేళ్లు హౌస్ కమిటీలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో తాము సభను అడ్డుకోలేదని, కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పదే పదే సభను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో వృద్ధ తల్లిదండ్రులకు భరోసా ఇచ్చే బిల్లుపై మాట్లాడమంటే అల్లరి చేస్తున్నారని, హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ నేతలు కోరుతున్నారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ నేతలు కోరుకున్నట్టు సభ జరగదని స్పష్టం చేశారు.