మర్పల్లి: అక్రమ సంబంధం.. మృతి

వికారాబాద్ జిల్లా బిల్కల్ గ్రామంలో చేరాల నర్సిములు (39) శుక్రవారం అనుమానాస్పదంగా మృతి చెందారు. మృతుడి భార్య చేరాల వసంత పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, అక్రమ సంబంధం కారణంగా తన భర్తను హత్య చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బ్యాగరి నర్సమ్మ, పాపయ్యలే కారణమై ఉండవచ్చని ఆమె పిర్యాదులో పేర్కొన్నారు. విచారణ జరిపి న్యాయం చేయాలని వసంత కోరారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

సంబంధిత పోస్ట్