మియాపూర్‌లో విషాదం... వివాహిత ఆత్మహత్య

మియాపూర్‌లోని మయూరి నగర్‌లో నివాసం ఉంటున్న 37 ఏళ్ల ఈషా సాహూ అనే మహిళ తన ఆరు నెలల కుమార్తెతో కలిసి ఆరో అంతస్తు నుంచి దూకింది. ఈ ఘటనలో ఈషా సాహూ అక్కడికక్కడే మృతి చెందగా, శిశువు సమీపంలోని ఫెన్సింగ్ కారణంగా ప్రాణాపాయం నుంచి బయటపడి స్వల్ప గాయాలతో బయటపడింది. చిన్నారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ప్రాథమిక విచారణలో, రెండో బిడ్డ జననం తర్వాత ఈషా సాహూ తీవ్ర మానసిక ఒత్తిడి, డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు.

సంబంధిత పోస్ట్