కోడిపందాలు ఆడుతున్న 15 మంది అరెస్టు

మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్ల, మేకల మండి వద్ద నిర్మానుష్య ప్రదేశంలో కోడిపందాలు ఆడుతున్న 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు కోళ్లు, రెండు కత్తులు, 15 మొబైల్ ఫోన్లు, 18 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్