శుక్రవారం కుషాయిగూడ బస్టాండ్ వద్ద 54 అడుగుల భారీ హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తుల బజరంగబలి నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. ఈ సందర్భంగా సీతారామస్వామి కళ్యాణాన్ని కూడా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి, యోగానంద సరస్వతీ స్వామి, త్రిదండి చిన జీయర్ స్వామి, చిట్టిపెద్ది రామశర్మ, బ్రహ్మశ్రీ ఆర్.శివ కార్తీక్ శాస్త్రి పాల్గొన్నారు. ఈ ప్రతిష్ఠాపన మహోత్సవం కన్నుల పండువగా సాగింది.