రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న రెండు లక్షల ఉద్యోగాలతో పాటు, 20వేల ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల నోటిఫికేషన్లను తక్షణమే విడుదల చేయాలని పీడిఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు నిరుద్యోగులతో కలిసి ఓయూలో ప్లకార్డులు పట్టుకొని పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.