రాగిరి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నాచారంలో చలివెంద్రం ఏర్పాటు..

రాగిరి జ్యోతి మోహన్ రెడ్డి సేవా సంస్థ వ్యవస్థాపకులు, బీజేపీ సీనియర్ నాయకులు రాగిరి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నాచారం ప్రధాన రహదారి, హెచ్ఎంటీ నగర్ బస్టాండ్ పక్కన చలివేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రవి నాయక్, రాష్ట్ర మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి తాడూరి శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షులు కే నవీన్ కుమార్, మాజీ అధ్యక్షులు మల్కా ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్