బోడుప్పల్ లోని ఓ మల్టీ స్పెషాలిటీ ట్రస్ట్ హాస్పిటల్ లో డబ్బులు చెల్లించలేదని నాగమ్మ(40) అనే మహిళకు ఆక్సిజన్ తీసేయడంతో ఆమె మృతి చెందింది. మృతదేహాన్ని డబ్బులు కట్టి తీసుకెళ్లాలని ఆస్పత్రి యాజమాన్యం ఒత్తిడి తెచ్చింది. డబ్బులు లేవని కుటుంబ సభ్యులు చెప్పడంతో, మహిళలను బాత్రూమ్ లు కడగాలని, వాచ్ మెన్ గా పనిచేయాలని బెదిరించినట్లు సమాచారం. ఈ ఘటనపై ఆస్పత్రి ముందు మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు.