హైదరాబాద్: బాలికతో వృద్ధుడి అసభ్య ప్రవర్తన.. కేసు నమోదు

కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్రా సాయిప్రియ కాలనీలో మైనర్ బాలికతో ఒక వృద్ధుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు, కుషాయిగూడ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మైనర్ బాలిక స్టేట్మెంట్ నమోదు చేసేందుకు ఆమెను భరోసా సెంటర్ కు తరలించారు. బాలిక స్టేట్మెంట్ ఆధారంగా నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, తగిన చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్