గురు పౌర్ణమి సందర్భంగా బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్, మెక్‌డోనల్డ్ కాలనీలో జరిగిన వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మేడ్చల్ కాంగ్రెస్ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ మాట్లాడుతూ, మనకు మంచి మార్గం చూపే ప్రతి శ్రేయోభిలాషి గురువుతో సమానమని అన్నారు. కార్యక్రమంలో అమర్ సింగ్, తోటకూర చందర్, విజయ్ యాదవ్, రాజలింగం తదితరులు పాల్గొన్నారు.