నాచారం, హెచ్ఎంటి నగర్ డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఆదివారం సీకే గార్డెన్‌లో సన్నాహక సమావేశం జరిగింది. సాయిజెన్ శేఖర్, మేడల మల్లికార్జున్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరై దిశానిర్దేశం చేశారు. గత పదేళ్లలో జరిగిన అభివృద్ధి, ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి డివిజన్ సమస్యల పరిష్కారానికి వందల కోట్ల నిధులు మంజూరు చేయడం వంటి అంశాలతో ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పట్ల సానుకూలంగా ఉన్నారని ఆయన తెలిపారు.