ఉప్పల్ డివిజన్ శ్రీరామ కాలనీలో 44 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కాలనీవాసులు తమ రోడ్డు సమస్యలను కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకురావడంతో, ఆమె అధికారులతో మాట్లాడి పనులు జరిగేలా చర్యలు తీసుకున్నారు. మంగళవారం కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించారు.