ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) విద్య, పరిశోధనల సమాచారాన్ని మరింత సమర్థవంతంగా ప్రచురణలోకి తీసుకురావడానికి ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగరం ప్రజాసంబంధాల విభాగంలో మార్పులు చేశారు. ప్రొఫెసర్ ఎ. ప్యాట్రిక్ ను ప్రధాన పౌరసంబంధాల అధికారిగా, పి. రఘుపతిని ప్రజా సంబంధాల అధికారిగా నియమిస్తూ పాలనా విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వీసీ ఇద్దరికీ ఉత్తర్వులు అందజేశారు.