గుర్రం జాషువా జయంతి సందర్భంగా సంస్మరణ సభ

కమలానగర్ సీఐటీయూ కార్యాలయ ప్రాంగణంలో తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో గుర్రం జాషువా 131వ జయంతి సందర్భంగా సంస్మరణ సభ నిర్వహించారు. గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించారు.
జాషువా చిత్రపటానికి జయరాజ్, శారద పూలమాలలు వేసి నివాళులర్పించారు. వక్తలు మాట్లాడుతూ కుల వివక్షను ఎదుర్కొంటూనే జాషువా సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకుని తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానాన్ని సంపాదించారని, ఆయన రచించిన ‘గబ్బిలం’ సామాజిక వివక్షపై గొప్ప సందేశాన్ని అందించిందని అన్నారు. కార్యక్రమంలో వెంకటాచలం, భాస్కర్‌రావు, శ్రీమన్నారాయణ, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕