ఓయూ పోలీస్ స్టేషన్‌లో తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు

ఓయూ పీఎస్ లో ఎమ్మెల్సీ కవితపై అనుచిత వాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నను వెంటనే అరెస్టు చేయాలని బీసీ విద్యార్థి సంఘాలు సోమవారం పిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ కవిత తెలంగాణా ఉద్యమంతో పాటు బీసీ సంఘాలను ఏకం చేసిందని, బీసీ రిజర్వేషన్ కోసం ఎన్నో మీటింగులు పెట్టిందన్న విద్యార్థి నాయకులు అన్నారు. కనీసం మహిళ అనే గౌరవం లేకుండా తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్నాడనీ, తీన్మార్ మల్లన్నలాంటి వ్యక్తులు తెలంగాణ సమాజానికి ప్రమాదకరమన్న విద్యార్థి నాయకులు. మల్లన్నను వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్