పరిగి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేపట్టింది. మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, వజ్రేష్ యాదవ్ తదితర నేతలు పాల్గొన్నారు. ప్రజలకు పార్టీని చేరువ చేయడం, పథకాలు వివరించడం, సమస్యలు తెలుసుకోవడం లక్ష్యంగా నిర్వహించారు. పాదయాత్ర పార్టీకి ఉత్సాహం నింపిందని నేతలు గురువారం తెలిపారు.