65 లక్షల చీరల పంపిణీ డిసెంబర్ లోగా పూర్తి చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పీసీసీ ఈసీ సమావేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల చీరల పంపిణీని డిసెంబర్ చివరిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు 35 లక్షల చీరలను మార్చిలోగా అందించాలని సూచించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, రాజకీయాల్లో పనులు చేయడంతో పాటు వాటిని చెప్పుకోవాలని అన్నారు. జిల్లా అధ్యక్షుల పదవులు గొప్ప బాధ్యతతో కూడుకున్నవని, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు.

సంబంధిత పోస్ట్