ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ సైనిక్ పురి బస్ స్టాప్ వద్ద ఎలక్ట్రిక్ స్కూటర్ అగ్నిప్రమాదానికి గురైంది. కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో స్కూటర్ నుండి పొగలు రావడం గమనించి, వెంటనే పక్కన పెట్టారు. క్షణాల్లో పెద్ద శబ్దంతో మంటలు చెలరేగి, స్కూటర్ పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తు కుటుంబ సభ్యులంతా సురక్షితంగా బయటపడ్డారు.