దొడ్డి కొమరయ్య జయంతి ఉత్సవ కమిటీ సభ్యునిగా గొరిగే నరసింహ

తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జయంతి ఉత్సవ కమిటీ సభ్యునిగా గొరిగే నరసింహను నియమించారు. మాజీ ఎమ్మెల్సీ జగ్గయ్య మల్లేష్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ దొడ్డి కొమరయ్య త్యాగాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. కురుమ సంఘం నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్