కమలానగర్ లో తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో ప్రముఖ కవి, అభ్యుదయవాది గురజాడ అప్పారావు 164వ జయంతి సందర్భంగా సంస్మరణ సభ నిర్వహించారు. స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బొమ్మగాని రుక్కయ్య, జయరాజు గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రుక్కయ్య దేశభక్తి గీతాన్ని ఆలపించారు. యాదగిరిరావు మాట్లాడుతూ గురజాడ వ్యవహారిక భాషను కవిత్వంలోకి తీసుకువచ్చి, కన్యాశుల్కం, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ రచనల ద్వారా సామాజిక దురాచారాలపై చైతన్యంకల్పించారని అన్నారు. జయరాజు మాట్లాడుతూ గురజాడ సామాజిక సంస్కరణలకు బాసటగా నిలిచారని పేర్కొన్నారు.