నాచారం లోని సిడిఎస్ బిల్డింగ్‌లో జిమ్‌ ప్రారంభం

నాచారం ఓల్డ్ విలేజ్‌లోని సిడిఎస్ బిల్డింగ్‌లో జిమ్‌ను ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిమ్ నిర్వాహకులు ఎమ్మెల్యే కి పుష్పగుచ్ఛంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం జిమ్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే గారు, అందులో ఏర్పాటు చేసిన సదుపాయాలను చూసి ప్రశంసించారు. ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ. నేటి వేగవంతమైన జీవనశైలిలో యువతతో పాటు అన్ని వయసుల వారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు.

సంబంధిత పోస్ట్