గురుపౌర్ణిమ సందర్భంగా బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని సాయిబాబా ఆలయాలను బోడుప్పల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చింతల శ్రీనివాస్ రెడ్డి దంపతులు, మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, మాజీ డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్ లతో కలిసి దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు శాలువాలతో సత్కరించి, అన్నదానంలో పాల్గొన్నారు.