హైదరాబాద్ లో కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్-2 పరిధిలోని పలు ప్రాంతాలకు శనివారం తాగునీరు సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఉదయం 6 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు ఈ సర్వీస్ నిలిపివేయబడుతుంది. వనస్థలిపురం, ఆటోనగర్, వైశాలినగర్, నాగోల్, బడంగ్ పేట, ఆదిభట్ల, బాలాపూర్ రిజర్వాయర్, నాచారం, తార్నాక, లాలాపేట, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు, శాస్త్రిపురం నేషనల్ ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోనుందని జలమండలి అధికారులు సూచించారు.