హైదరాబాద్‌లో ఘనంగా ఐసీఏఎస్ అఖిల భారత జ్యోతిష్య సదస్సు

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రలాజికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో అఖిల భారత జ్యోతిష్య సదస్సు హైదరాబాద్‌, ఉప్పల్ ఎస్‌వీఎం గ్రాండ్‌లో ఘనంగా నిర్వహించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 500 మంది కార్యవర్గ సభ్యులు, చాప్టర్ చైర్‌పర్సన్‌లు, జ్యోతిష్య నిపుణులు, విద్యార్థులు ఈ సదస్సుకు హాజరయ్యారు. సాంప్రదాయబద్ధంగా దీప ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రారంభోపన్యాసంలో ప్రముఖ జ్యోతిష్యవేత్త గాయత్రీ వాసుదేవ్ మాట్లాడుతూ, ఒక వైదిక జ్యోతిష్కుడు సత్యనిష్ఠ, గణిత నైపుణ్యం, నిష్పక్షపాత వైఖరి, సేవాభావం, ఉల్లాస స్వభావం వంటి లక్షణాలను కలిగి ఉండాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్