భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఉప్పల్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్ వద్ద గ్యాస్ సిలిండర్ ధరల పెంపు, డీజిల్, పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వ వైఖరికి నిరసన తెలిపారు. సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఎస్. బోస్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ధరలు పెంచబోమని ప్రజలను మభ్యపెట్టి, ఎన్నికలు అయిపోయిన వెంటనే కమర్షియల్ సిలిండర్ ధరలను రూ. 993 పెంచారని ఆరోపించారు.