తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి పథకం పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తోందని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఈ పథకంలో భాగంగా నాగారం ప్రాంతానికి చెందిన గన్నెగోని అనురాధ గౌడ్ కుటుంబానికి మంజూరైన రూ. 1, 00, 116 విలువైన కళ్యాణ లక్ష్మి చెక్కును నాగారం మాజీ చైర్మన్ చంద్రారెడ్డి, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్, మెరుగు శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి నరేష్ చేతుల మీదుగా లబ్ధిదారు కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.