వక్రతుండ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఘనంగా మహా అన్నదానం

మేడ్చల్ జిల్లా చెంగిచర్ల డివిజన్ చిన్న క్రాంతి కాలనీలో వక్రతుండ బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాన్ని స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరై ఘనంగా ప్రారంభించారు. అనంతరం ముఖ్య అతిథులు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలను వితరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. "గణేష్ నవరాత్రి ఉత్సవాలను వక్రతుండ బ్రదర్స్ సభ్యులు ప్రతి సంవత్సరం ఎంతో భక్తిశ్రద్ధలతో, ఐకమత్యంతో నిర్వహించడం అభినందనీయం అన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕