మల్లాపూర్ లో ఏకదంతా వినాయక అసోసియేషన్ ఆధ్వర్యంలో అచ్చగొని దినేష్ గౌడ్ అధ్యక్షతన వినాయక చవితి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. గణనాథుడికి ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. వేడుకల్లో భాగంగా గణపతి మండపం ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు, మల్లాపూర్ వాసులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. అన్నదాన కార్యక్రమానికి స్థానిక నాయకులు హాజరై భక్తులకు ప్రసాదాన్ని అందజేశారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.