హైదరాబాద్ ఉప్పల్‌లోని మల్లాపూర్ డివిజన్ దుర్గానగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో "స్మైల్ విత్ షైన్" వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటుపుస్తకాలు, బ్యాగులు, ప్లేట్లు, గ్లాసులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ముఖ్యఅతిధులుగా హాజరయ్యారు. విద్యే పేదరిక నిర్మూలనకు మార్గమని వారు పేర్కొన్నారు.