బీఎస్పీ రోజు రోజుకూ బలపడుతోందని, బహుజనులకు అండగా నిలుస్తుందని బీఎస్పీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవీందర్ నాయక్ అన్నారు. మేడ్చల్ జిల్లాలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా గుగులోత్ శ్రీనివాస్‌ను నియమించారు. మేడ్చల్ నియోజకవర్గం అధ్యక్షులు జంగయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మేడ్చల్ జిల్లా ఇన్‌ఛార్జ్ గౌడ సుదర్శన్, జిల్లా అధ్యక్షులు బానోత్ రవీందర్ నాయక్ చేతుల మీదుగా గుగులోత్ శ్రీనివాస్‌కు నియామక పత్రం అందించారు.