చర్చకు రాక మంత్రి జూపల్లి యూ టర్న్: కూరెల్లి నాగరాజు గౌడ్

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పుల భారంపై బహిరంగ చర్చకు మంత్రి జూపల్లి కృష్ణారావు విసిరిన సవాల్‌ ను స్వీకరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారని, అయితే మంత్రి అక్కడికి రాకపోవడం ఆయన యూ టర్న్‌కు నిదర్శనమని బీఆర్ఎస్ యువజన విభాగం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరెల్లి నాగరాజు గౌడ్ ఆరోపించారు. నాగరాజు గౌడ్ మాట్లాడుతూ, కేటీఆర్‌ తో పాటు మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా తెలంగాణ భవన్‌లో చర్చ కోసం వేచి ఉన్నారని తెలిపారు. మంత్రి జూపల్లి కోసం ప్రత్యేకంగా కుర్చీ ఏర్పాటు చేసి, శాలువాతో స్వాగతానికి సిద్ధంగా ఉన్నప్పటికీ జూపల్లి అక్కడికి రాలేదని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్