ఆదివారం హెచ్ఎంటి నగర్ పెద్ద చెరువు కట్టపై ఏర్పాటు చేసిన చెరువు సుందరీకరణ సంబరాల ఏర్పాట్లను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పర్యవేక్షించారు. దశాబ్దాల సమస్య పరిష్కారం అవుతున్న సందర్భంగా నాచారం, హెచ్ఎంటి నగర్ డివిజన్ ప్రజలు పెద్ద సంఖ్యలో రేపు ఉదయం కార్యక్రమానికి రావాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బారాస రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్, విట్టల్ యాదవ్, కట్ట బుచ్చన్న గౌడ్, వేముల మారయ్య, భూపాల్ రెడ్డి, ఎర్రం శ్రీనివాస్ రెడ్డి, చంద్రశేఖర్, ఖాదర్, లడ్డు శివ తదితరులు పాల్గొన్నారు.