రాంపల్లి చెరువులో గురపు డెక్కలు పేరుకుపోవడంతో భరత్ నగర్, అరుంధతి కాలనీ, లక్ష్మి నగర్ కాలనీల్లో దోమల సమస్య తీవ్రమైంది. ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తక్షణమే చెరువును శుభ్రం చేసి, దోమల నివారణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.