హైదరాబాద్‌లో ఏప్రిల్ 2న జరగనున్న హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా, విశ్వహిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ 'బజరంగీ' అనే నూతన గీతాన్నిమంగళవారం విడుదల చేశాయి. 'కర్మన్‌ఘాట్ గడ్డపై ఎగిరే జెండా' అంటూ సాగే ఈ పాట హిందువుల్లో ఉత్సాహాన్ని నింపుతుందని తెలిపారు. ఈ యాత్ర కోసం మరిన్ని కొత్త పాటలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య, వీహెచ్‌పీ ప్రతినిధి శశిధర్ తదితరులు పాల్గొన్నారు.